నేను మీలో ఒకడిని..ఆశీర్వదించండి.. నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత.. జగనన్నను మళ్ళీ సీఎం చేసుకుందాం.. ఎం. వీరాంజనేయులు..
నేను మీలో ఒకడిని..ఆశీర్వదించండి.. నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత.. జగనన్నను మళ్ళీ సీఎం చేసుకుందాం.. ఎం. వీరాంజనేయులు
◆ ప్రజలను మభ్య పెట్టేందుకే టీడీపీ కూటమి
'నేను మీలో ఒకడిని.. ఆశీర్వదించండి.. శింగనమల నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా' అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండలం ఓబుళాపురం, దండువారిపల్లి, ఏడావులపర్తి, దయ్యాలకుంటపల్లి, వెంకటాపురం గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి ఆయన చేపట్టారు.
గ్రామస్తులు, నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ.. అవ్వాతాతలను,ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని వారికి వివరిస్తూ, సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలను విజ్ఞప్తి చేశారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తుంటే, చంద్రబాబు నాయుడు అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి కూటమితో జతకట్టి వస్తున్నారని వారిని నమ్మి మోసపోకండి అన్నారు. జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే సంక్షేమం, అభివృద్ధి పూర్తి స్థాయిలో కొనసాగుతాయన్నారు. తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో టిడిపి వాళ్లు మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని వారిని వారి సొంత పార్టీ వారే నమ్మే పరిస్థితుల్లో లేనప్పుడు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రజలు కష్ట కాలంలో ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో లేని అభ్యర్థి, ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్నారనే విషయాన్ని గమనించాలని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను, ఎంపీ అభ్యర్థి అయిన శంకర్ నారాయణ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 23 2024, 08:01